ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
పాటియాలా: రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నవారిపైకి ఒక కారు దూసుకొచ్చింది.

పాటియాలా: రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నవారిపైకి ఒక కారు దూసుకొచ్చింది. అనుకోకుండా కారు తమపైకి దూసుకురావడంతో ధర్నాలో కూర్చున్నవారు తలో దిక్కుకు పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా థాపర్ కాలేజీకి సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
పాటియాలాలోని భడ్సో రోడ్డులో రైతులకు మద్దతుగా పలువురు ధర్నాలో కూర్చున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ధర్నాలో కూర్చున్నవారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, కోపంతో ఉన్న రైతులు భదాస్ రహదారిపై సిట్ సమ్మె ప్రారంభించారు. మృతుడిని పాటియాలలోని రంజిత్‌నగర్ నివాసి అయిన 65 ఏండ్ల ఇంద్రజిత్ సింగ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో రితు రాణి, రాహుల్ కుమార్, నైరా, పరమవీర్ సింగ్, దీపు, జాస్, గుర్ప్రీత్ సింగ్, పరమవీర్ సింగ్ ఉన్నారు. కారును వేగంగా నడుపుతూ అదుపుకోల్పోయి ధర్నాలో కూర్చున్నవారిపైకి రావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, అతడి భార్య, బిడ్డ కూడా గాయపడ్డారు. వారిని కూడా పోలీసులు సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్న స్థితిలో ఉన్నాడని, దాంతోనే కారుపై అదుపు కోల్పోయాడని ప్రమాదాన్ని చూసిన పలువురు తెలిపారు.
తన తండ్రి ఇతరులతో కలిసి భడ్సో రోడ్లో గత 20-25 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని, కేంద్రం ఇకనైనా ఇలాంటి మరణాలు జరుగకుండా ఆపేందుకు తమ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మృతుడు ఇంద్రజిత్ సింగ్ కుమారుడు హరీందర్ సింగ్ విజ్ఞప్తిచేశారు.
కాగా, అమృత్‌సర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జనవరి 26 న జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. కోపోద్రిక్తులైన రైతులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి..
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్‌పిన్ లాలా
బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

