బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బ్రసీలియా: కరోనా వ్యాక్సిన్ కొరత సమస్యపై బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో తన పదవికి రాజీనామా చేశారు.

బ్రసీలియా: కరోనా వ్యాక్సిన్ కొరత సమస్యపై బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో తన పదవికి రాజీనామా చేశారు. వ్యాక్సిన్ సరఫరాపై దౌత్యపరమైన వైఫల్యం ఉన్నదని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అరౌజోపై నిరంతరం విమర్శలు రావడంతో చివరకు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని, అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. బ్రెజిల్ స్థానిక వార్తాపత్రిక ‘బ్రెజిల్ ఓ గ్లోబో ‘ ప్రకారం.. మంత్రి తన రాజీనామా నిర్ణయం గురించి కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చి.. రాజీనామా లేఖను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు పంపించారు.
‘ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందులు సృష్టించడం నాకు ఇష్టం లేదు’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, అరౌజో రాజీనామాపై ఇంకా అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
రక్షణ మంత్రి ఫెర్నాండో అజీవెడో ఈ సిల్వా .. క్లుప్త ప్రకటనలో ఆశ్చర్యకరమైన అరౌజో నిష్క్రమణను ప్రకటించారు.
67 ఏళ్ల ఆర్మీ రిజర్వ్ జనరల్ అజీవెడో ఈ సిల్వా, 53 ఏళ్ల కెరీర్ దౌత్యవేత్త అయిన ఎర్నెస్టో అరౌజో ఇద్దరూ 2019 జనవరిలో బోల్సోనారో అధికారం చేపట్టినప్పటి నుంచి మంత్రి పదవుల్లో ఉన్నారు.
అరౌజో రాజీనామాకు ముందు.. టీకాలను సరఫరా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బ్రెజిల్ పార్లమెంటులో పలువురు సభ్యులు ఆరోపించారు. దాంతో అరౌజో తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా ఉండటం వల్లనే బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్లు సరిపడా అందలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా వైరస్ సోకిన అమెరికా తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉన్నది. బ్రెజిల్లో పరిస్థితులు ప్రతిరోజూ మరింతగా దిగజారుతున్నాయి. గత కొద్ది రోజులలో ప్రతిరోజూ మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతుండటం కలవరపాటుకు గురిచేస్తున్నది. మార్చి 23 న కరోనా కారణంగా 3,158 మంది, మార్చి 27 న 3,650 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి..
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్‌పిన్ లాలా
బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

