Amazon Great Indian Festival Diwali Sale 2025 | దీపావళి పండుగ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ దీపావళి సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. సుమారుగా 1 లక్ష ఉత్పత్తులపై ఆఫర్లను, రాయితీలను అందిస్తున్నారు. శాంసంగ్, యాపిల్, ఇంటెల్, టైటాన్ వంటి అనేక కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఉత్పత్తులపై గరిష్టంగా 80 శాతం వరకు తగ్గింపు ధరను పొందే అవకాశం కల్పించారు. కనీసం రూ.150 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. జీఎస్టీ తగ్గింపుతోపాటు ఈ సేల్‌లో రాయితీలను అందిస్తున్నందున ఆయా ఉత్పత్తుల ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా హోమ్ డెకార్, ఫ్యాష్, కిరాణా సరుకులు, ఇతర ఉత్పత్తులపై ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో శాంసంగ్‌కు చెందిన పలు ఫ్లాగ్ షిప్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.73,999 ధరకు కొనవచ్చు. దీనిపై రూ.1750 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ ఎ55 5జి ఫోన్‌పై రూ.19వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.23,999గా ఉంది. గెలాక్సీ ఎం36 5జి ఫోన్ ధర రూ.14,999 ఉండగా, ఈ ఫోన్‌పై ఏకంగా రూ.8వేల వరకు ఆదా చేయవచ్చు. గెలాక్సీ బడ్స్ 3 ప్రొ ఇయర్‌బడ్స్ ను రూ.10,999 ధరకు కొనవచ్చు. వీటిపై రూ.7వేల వరకు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15 ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.11,900 తగ్గింపు ధర అనంతరం రూ.47,999 ధరకు కొనవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ ఫోన్లను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నారు. వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌ను రూ.36,999 ధరకు అందిస్తుండగా దీనిపై రూ.2వేల వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్ ప్లస్ నార్డ్ 5 ఫోన్‌ను రూ.30,249 ధరకు కొనవచ్చు. రూ.1750 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ధర రూ.4,970గా ఉంది. వీటిపై రూ.330 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ఐక్యూకు చెందిన నియో 10 5జి ఫోన్‌ను రూ.2వేల డిస్కౌంట్‌తో రూ.29,999 ధరకు కొనుగోలు చేసే సదుపాయం ఉంది. ఐక్యూ జడ్10ఆర్ 5జి ఫోన్‌ను రూ.17,499 కు కొనవచ్చు. దీనిపై రూ.2వేల వరకు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రియల్‌మికి చెందిన నార్జో 80 లైట్ ఫోన్‌ను రూ.9,899 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.5,100 వరకు ఆదా చేసే వీలుంది. రెడ్మీ ఎ4 5జి ఫోన్‌ను రూ.7,499 ధరకు కొనవచ్చు. దీనిపై రూ.3500 ఆదా చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా టీవీలపై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. శాంసంగ్, షియోమీ వంటి కంపెనీలకు చెందిన టీవీలను తగ్గింపు ధరలకు కొనవచ్చు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ట్యాబ్, ఐడియా ట్యాబ్ స్మార్ట్ చాయిస్ వంటి ట్యాబ్‌లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఫ్యాషన్, ఫుట్‌వేర్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 70 శాతం, గ్రాసరీ, స్నాక్స్‌పై 40 శాతం, హోమ్ అండ్ డెకార్ ఉత్పత్తులపై 80 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు. ఏథర్ రిట్జా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1,04,999 ధరకు కొనవచ్చు. హోరో మోటోకార్ప్ ఎక్స్ ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ బైక్‌ను రూ.86,775కు కొనవచ్చు. ఇలా అనేక ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లను, భారీ రాయితీలను అందిస్తున్నారు. అలాగే బ్యాంకు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ పేజీని సందర్శించవచ్చు.