3I Atlas | సౌరకుటుంబం ఆవల నుంచి వేగంగా దూసుకువస్తున్న ‘3ఐ/అట్లాస్ (3I/Atlas) అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. సెకనుకు 61 కిలోమీటర్ల (అంటే గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్ల వేగం) అసాధారణ వేగంతో ఈ తోక చుక్క ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ తోకచుక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. దాంతో భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొంది. మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను గుర్తించడం ఇది మూడోసారి. గతంలో 2017లో ‘ఔమువామువా’, 2019లో ‘2ఐ/బోరిసోవ్’ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా అట్లాస్ తోకచుక్క సౌరకుటుంబం ఆవల నుంచి వస్తున్న మూడో అతిథిగా పేరుకుంటున్నారు. దాని పేరులో ‘ఐ’ అక్షరం ‘ఇంటర్స్టెల్లార్’ని సూచిస్తున్నది. ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ ఏడాది జులై 1న చిలీలోని రియో హర్టాడోలో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుంది నాసా పేర్కొంది. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా.. అంటే సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంగారక గ్రహ కక్ష్యకు కొద్దిగా లోపలి భాగంలో ఉంటుంది. భూమికి, ఈ తోకచుక్కకు మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుందని నాసా క్లారిటీ ఇచ్చింది. ఈ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కూడా దాని దూరం సుమారు 27 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని.. కాబట్టి భూమికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. హబుల్, జేమ్స్ వెబ్ వంటి శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా దీని గమనాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ చివరిలో సూర్యుడి దగ్గర నుంచి ప్రయాణించి, మార్చి 2026 నాటికి బృహస్పతిని దాటి తిరిగి మన సౌర వ్యవస్థ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Is this 3I/ATLAS?! I created a time-lapse using 9 minutes of images captured by Mars Perseverance on October 2nd, and we clearly observe something traveling very fast across the night sky against the normal motion of travel (due to Mar’s rotation). Remember that #3IATLAS is… pic.twitter.com/cbxv006jCx
— Stefan Burns (@StefanBurnsGeo) October 3, 2025