కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 08 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (TSGREA) కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ యూనిట్ కార్యవర్గాన్ని బుధవారం కొత్తగూడెం రామ టాకీస్ రోడ్డు లోని అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్.రాములు, కార్యదర్శిగా ఐ.మనోహర్ భాస్కర్, ఫైనాన్స్ సెక్రటరీగా ఎస్కే.గులామహమ్మద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా సిహెచ్ ఎల్ ఎన్.శాస్త్రి, వి.జైన్, జాయింట్ సెక్రటరీగా సిహెచ్.రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.స్వర్ణకుమారి, పబ్లిసిటీ సెక్రటరీగా ఏ.నరసింహారావు, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్లుగా ఎస్కే.ఇమామ్, ఆర్.లక్ష్మీనారాయణ, బి.వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికల అధికారిగా డి.స్వామిదాస్ (ఇల్లెందు), అబ్జర్వర్‌గా ఎండీ.నిజాముద్దీన్ (కొత్తగూడెం) వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ జే ఆర్. వెస్లీ, ఆర్.వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొని పర్యవేక్షణ చేసి, నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.