vivo V60e | అదిరిపోయే ఏఐ ఫీచర్లు, భారీ బ్యాటరీ, కెమెరాలతో లాంచ్ అయిన వివో నూతన స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఓ నూతన ఏఐ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వి60ఇ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. వి60 సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
vivo V60e | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఓ నూతన ఏఐ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వి60ఇ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. వి60 సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లేను సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది.
భారీ కెమెరా..
ఈ ఫోన్లో వెనుక వైపు ఏకంగా 200 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలకు గాను ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. అందువల్ల ఫొటోలు, వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. దీనికి గాను 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. సర్కిల్ టు సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఎరేజ్ 2.0 వంటి ఏఐ ఫీచర్లను ఈ ఫోన్లో పొందవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ లభిస్తుంది. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఐపీ 68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ డిస్ ప్లేకు డైమండ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను అందిస్తున్నారు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయాలను సైతం అందిస్తున్నారు.
ధర వివరాలు..
వివో వి60ఇ స్మార్ట్ ఫోన్‌ను నోబుల్ గోల్డ్, ఎలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అక్టోబర్ 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 10 శాతం ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- smart phones
- Vivo
- vivo v60e
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

