Polio vaccination | 12న 5 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషనల్ స్పెషల్ డ్రైవ్
Polio vaccination | ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
Polio vaccination | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మన రాష్ట్రంలో పోలియో చివరి కేసు 2007లో నమోదు అయింది. మన దేశంలో 2011లో చివరి కేసు నమోదు అయింది. గత 3 సంవత్సరాలుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. ఆయా దేశాల నుంచి రాకపోకలు జరుగుతున్న దేశంలోని పలు జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో మన రాష్ట్రం నుంచి 5 జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ) ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఈ 5 జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్‌లో పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర్నుంచి, 5 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

