మూడేండ్ల నాటి ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించి కాంగ్రెస్ భంగ పడింది. కేటీఆర్ కృషితో 2020లోనే 20వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న అమెజాన్ గతేడాది రూ.36 వేల కోట్లకు దానిని పెంచింది. అయితే దీనిని ‘అమెజాన్ కొత్త పెట్టుబడి’ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకోబోయి బోల్తా పడింది.
Amazon | హైదరాబాద్, జనవరి 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే రా ష్ట్రం నుంచి కార్నింగ్ వంటి సంస్థలు ఇతర ప్రాం తాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ పరివారం నకిలీ ప్రచారానికి తెర తీసింది. కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో వచ్చిన పెట్టుబడులను తమ ఘనతగా చెప్పుకోవటం ప్రారంభించింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ విషయాన్ని నెటిజన్లు పసిగట్టి కాంగ్రెస్‌కు కౌం టర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసుకొన్న ఒప్పందాలను ఆధారాలతో సహా బయటపెట్టి హస్తం శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక బిక్కముఖం వేసుకోవటం ఆ పార్టీ నేతల వంతైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో అమెజాన్ రూ.20,096 కోట్ల పెట్టుబడులను హై దరాబాద్‌లో పెట్టేందుకు 2020లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది. విస్తరణలో భాగంగా 2030 నాటికి రూ.36,300 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా 2022-23లో మరోమారు ఒప్పందం చేసుకొన్నది. ఇదే విషయమై చర్చించేందుకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైదరాబాద్‌లో అమెజాన్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందంటూ కాంగ్రెస్ అనుకూల మీడి యా సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. తమ ప్రభు త్వ ఘనతగా అబద్ధపు ప్రచారాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అసలు విషయాన్ని గ్రహించిన నెటిజన్లు.. 2020, 2022-23లో అమెజాన్‌తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకొన్న డీల్స్, వార్తల క్లిపింగ్స్‌ను ఆధారాలతో సహా పోస్టుల రూపంలో పెట్టారు. ఒకరి కృషిని తమ ఘనతగా చెప్పుకొంటున్న కాంగ్రెస్.. ఇకనైనా నకిలీ ప్రచారాన్ని మానుకోవాలని గట్టి కౌంటర్లు ఇచ్చారు.