హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులంతా లౌకికవాదం వైపే ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు తావులేదని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో వాటర్ వర్స్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన సంఘం ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో బీజేపీ ఆటలు చెల్లవని అన్నారు. కులమత భేదాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని చూసిన బీజేపీ అనుబంధ సంఘం ఓడిపోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కార్మిక, ఉద్యోగులకు న్యాయం జరుగుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హకులను కాలరాస్తున్నదని, భవిష్యత్తులో కార్మిక, ఉద్యోగులంతా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సభలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వరింగ్ ప్రెసిడెంట్ పీ నారాయణ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల మారయ్య, హమాలీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.