హుజూరాబాద్ : ఈరోజు మేము ఈటెల దళిత బాధితుల సంఘంగా వీణవంక మండలానికి వచ్చినం. కొన్ని గ్రామాలు తిరిగినం. ఈటెల చేసిన అరాచకాలపైన, అక్రమ కేసుల పైన ఈ రోజు కొన్ని గ్రామాలకు పోయినం. మేము గ్రామాలల్ల దళితవాడలకు పోతే చాలా చక్కటి స్పందన వచ్చింది. దళితులంతా ఈటెలకు వ్యతిరేకంగా ఉన్నారు. మా దళితజాతి మీద అనేకమందిమీద కేసులు పెట్టిన సందర్భం ఉంది అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈటెల నిన్న ఒక ప్రెస్మీట్లో మాట్లాడిండు. అయ్యా ఈటెల రాజేందర్ గారు మీరు సొక్కం పూసే అని చెపుతున్నరు కదా! మేము ఎవరినీ చంపించలేదని చెబుతున్నరు కదా! ఎవరిమీద రౌడీషీట్లు ఓపెన్ చేయలేదని చెపుతున్నరు కదా! ఎవరిమీద అక్రమ కేసులు పెట్టలేదని చెబుతున్నరు కదా!
మీ బామ్మర్ధి చేసిన చాటింగ్ బయటకు వచ్చినపుడు అందులో మాదిగ లంజకొడుకులు అని మాట్లాడినా..అది ఒక ఫేక్ అని ఆరోజు తప్పించుకున్నరు. మొన్నటికి మొన్న దళితబంధు ఇవ్వకూడదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈటెల ఇచ్చిన లేఖ బయటకు వచ్చింది. అది కూడా ఫేక్ అభివర్ణిస్తున్నవు. మా మీద కేసులు పెట్టలేదని చెపుతున్నవు.
చివరికి ప్రవీణ్యాదవ్ చావుకు కూడా నేను కారణం కాదని చెబుతున్నవు. కానీ ఆయన తల్లి తన కడుపుగోసను మన్నెత్తి, దుమ్మెత్తి పోస్తున్నపుడు నల్లమొకం ఏసుకొని ఎనుకకు తిరిగి వచ్చినవు తప్ప వచ్చి ప్రెస్మీట్ పెట్టినవు కానీ అదేరోజు అక్కడే ఆగి నేను చంపించలేదు తల్లి, నాకు సంబంధం లేదు తల్లి అని ఎందుకు చెప్పలేకపోయినవు? నీవు నియోజవర్గ ప్రజలకు , దళితులకు , మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీ,ఎస్టీలకు క్షమాపణ చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేస్తున్నాం.
మేము వీణవంక మండలంలో గడపగడపకు పోతం. వారి బాధలు వింటం. దళితులు, బీసీలు ఈటెలకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఎవరికైనా ఓటేయ్యండి కానీ ఈటెలకు మాత్రం వేయద్దని ప్రచారం చేస్తాం.
-తిప్పారపు సంపత్, ఈటెల దళిత బాధితుల సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు