పాల్వంచ, మే 24: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఆదివారం పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో సమన్వయ కమిటీ బాధ్యులు, నాయకుల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ డివిజన్లు, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బూత్‌స్థాయి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు వేగవంతం, డిజిటల్ యాప్ వినియోగం, పార్టీ బలోపేతంపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ప్రతి కార్యకర్త పార్టీ కోసం సమష్టిగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.