Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Alai-Balai | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అలయ్-బలయ్ ’ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ ( Rayapole ) మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అలయ్-బలయ్ ’ ( Alai-Balai ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగ వాతావరణం లో సాగిన ఈ కార్యక్రమం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్-బలయ్ వేడుకలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రానున్న ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు దశా దిశా నిర్దేశించారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేకుల నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మండల యువజన నాయకులు గల్వ దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్ , మండల మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్, సర్పంచులు పాల్గొన్నారు.
కేసీఆర్‌పై ప్రత్యేక పాట విడుదల
ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా బాపు కేసీఆర్‌పై రూపొందించిన నూతన పాటను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విడుదల చేశారు. జొన్నోజి క్రియేషన్స్ ఆధ్వర్యంలో జొన్నోజి నాగులు రచించిన ఈ పాటను ఆవిష్కరించడం కార్యక్రమంలో విశేషంగా నిలిచింది. కేసీఆర్‌పై రూపొందించిన ఈ పాట విడుదలతో కార్యక్రమంలో సందడి నెలకొంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

