Dhurandhar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ యాక్షన్ఎంటర్టైనర్ ఫస్ట్ డే నుంచి అంచనాలను అధిగమించి రికార్డు వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. ఇప్పటివరకు ధురంధర్ మొత్తం రూ.300 కోట్ల నెట్ కలెక్షన్లు దాటడం విశేషం.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ఖన్నా బలోచ్ గ్యాంగ్ లీడర్ రెహ్మాన్ డెకాయిట్ పాత్రలో నటించాడని తెలిసిందే. ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెంటేషన్‌తో అక్షయ్ ఖన్నా సినిమాకే హైలెట్‌గా నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్ మ్యాన్ షోలా సాగే యాక్టింగ్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకునేలా చేసిన అక్షయ్ఖన్నా తీసుకున్న పారితోషికం గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
అయితే సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిన అక్షయ్ ఖన్నా కేవలం రూ.3 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. కథనం, స్టోరీలైన్‌లో డెప్త్ ఉండే ఇలాంటి పాత్ర కోసం అక్షయ్ఖన్నా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ధురంధర్ ఈ ఏడాది బాలీవుడ్లో టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్సులు, రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కథలోని ఇంటెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా మారాయి.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్