Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్, ఘజియాబాద్‌లోనూ అధికారులను పాఠశాలలను మూసివేశారు. కాలుష్యం కారణంగా పాఠశాలలకు మూడురోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పాఠశాలలకు సెలవులు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 10 వరకు మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాలుష్యం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అయితే, 6-12 విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతున్నది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు కురుస్తున్నది. గురువారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నది. ఢిల్లీ నగరంతో పాటు గ్రేటర్ నోయిడా, ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయింది. ఈ నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలులోకి వచ్చింది.