Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో (Karnataka) కుర్చీలాట కొనసాగుతున్నది. సీఎం (Karnataka CM) పీఠంపై రోజురోజుకూ వివాదం ముదురుతున్నది. ఒక పక్క తానే ఐదేండ్లూ అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్వయంగా ప్రకటించినా.. ఈ చర్చకు మాత్రం తెరపడట్లేదు. డిప్యూటీ సీఎం మద్దతుదారులు మాత్రం ఈ నవంబర్‌లో డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పు వివాదంపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (BZ Zameer Ahmed Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. కానీ, సిద్ధరామయ్య తన ఐదేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాతే డీకే ఆ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. 2028 వరకూ ఐదేండ్ల పూర్తికాలం కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. ‘డీకే శివకుమార్ సీఎం కావాలన్న కోరిక ఆయన మద్దతుదారులకు ఉండటం సహజం. ఆయనకు కూడా అదే కోరిక ఉంది. కానీ 2028 వరకూ సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారు. ఆయన ఐదేండ్ల పూర్తి పదవికాలం తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Layoffs | లక్షకుపైగా ఉద్యోగాల కోత.. ఈ ఏడాదీ టెక్ రంగంలో భారీగా తొలగింపులు
‘బాహుబలి’ ప్రయోగం సక్సెస్.. ‘ఎల్వీఎం-3’ ద్వారా ఉపగ్రహం నింగిలోకి
టెక్ రంగంలో లేఆఫ్స్.. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం