కాబుల్, సెప్టెంబర్ 2 : సుమారు 6.0 తీవ్రతతో అల్లకల్లోలం చేసి జనావాసాలను శవాల దిబ్బగా మార్చిన భారీ భూకంపం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మంగళవారం మరోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. నాన్గర్హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ పట్టణానికి ఈశాన్యంలో 34 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా 5.4 తీవ్రతతో సంభవించినట్టు అధికారులు తెలిపారు.
కాగా, ఆదివారం నాటి భూకంపానికి 1,430 మందికి పైగా మరణించగా, మూడు వేల మందికి పైగా గాయపడినట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు.