హైదరాబాద్, ఆట ప్రతినిధి: కన్హా శాంతి వనం వేదికగా హార్ట్ఫుల్నెస్ 79వ ఇంటర్‌స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీ వరకు జరుగనున్న పోటీలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శాంతి వనంలో దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్లేయర్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నారు. మెరుగైన మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతీ ఒక్కరూ ప్రతిభ చాటాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.