బీజింగ్, సెప్టెంబర్ 2 : చీకట్లో వెలుగులు వెదజల్లే ఓ మొక్కను చైనా సైంటిస్టులు సృష్టించారు! ఈ విధమైన మొక్కలను రాబోయే రోజుల్లో వీధి దీపాలుగా వాడొచ్చునని వారు భావిస్తున్నారు. వెలుగులు విరజిమ్మేందుకు ఈ మొక్కలకు ఆప్టో-ఫ్లోఫర్ అనే ప్రత్యేక పార్టికల్స్‌ను చేర్చారు. ఇవి సూర్యరశ్మిని గ్రహించి కొన్ని గంటలపాటు కాంతిని వెదజల్లుతాయి.
సూర్యరశ్మిలో కానీ, ఎల్ఈడీ వెలుతురులో కానీ కొన్ని నిమిషాల పాటు ఈ మొక్కలు ఉంచితే, తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఇవి వెలుతురునిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. 10 నిమిషాల్లో ఈ మొక్కను తయారుచేయవచ్చునని, ఇందుకు రూ.116 ఖర్చు అవుతుందని వివరించారు.