ముంబై: టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్‌శర్మ ఫుల్ ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన హిట్‌మ్యాన్ రానున్న ఆస్ట్రేలియా సిరీస్ కోసం పూర్తి స్థాయిలో చెమటోడుస్తున్నాడు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ నేతృత్వంలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన రోహిత్ దాదాపు 20 కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది.
ఐపీఎల్ తర్వాత నుంచి ఆటకు దూరంగా ఉన్న ఈ స్టార్ క్రికెటర్ అధిక బరువుతో కనిపించాడు. అయితే 2027 వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ అందుకు తగ్గట్లు నాయర్ పర్యవేక్షణలో జిమ్‌లో కష్టపడటం తెలిసిన సంగతే. బోర్డుగా కొత్తగా తీసుకొచ్చిన బ్రాంకో టెస్టులోనూ రోహిత్ అందరి అంచనాలను తలక్రిందులు చేశాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్నెస్ టెస్టు ముగించుకుని ముంబైకి చేరుకున్న రోహిత్ బరువు తగ్గి కొత్తగా కనిపించాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు.