మరో టెక్ కంపెనీలో లేఆఫ్స్ : 100 మంది ఉద్యోగులపై అడోబ్ వేటు
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి.
న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా తాజాగా అడోబ్లోనూ కొలువుల కోత కలకలం రేపుతోంది.
అడోబ్ ఇప్పటికే సేల్స్ టీమ్‌కు చెందిన 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం 28,700 మంది ఉద్యోగులు అడోబ్‌లో పనిచేస్తుండగా రాబోయే రోజుల్లో ఉద్యోగ భద్రతపై సిబ్బందిలో గుబులు మొదలైంది. ఇక అడోబ్‌తో పాటు బైజూస్, జోష్, హెల్తిఫైమి వంటి దేశీ టెక్ కంపెనీలు సైతం గత కొద్ది వారాలుగా పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి.
తొలగించిన ఉద్యోగులకు కంపెనీలోని ఇతర పొజిషన్లలో అవకాశాలు కల్పించేందుకు అడోబ్ యోచిస్తోంది. కీలక విధులను నిర్వహించే విభాగాలకు ఉద్యోగులను బదలాయించామని అడోబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము ఎక్కడా కంపెనీ వ్యాప్తంగా లేఆఫ్స్ ప్రకటించలేదని, కీలక పోస్టుల్లో నియామకాలూ చేపడుతున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Adobe
- layoffs
- Tech gaint
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

