ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రక్తదాతల సం ఖ్య తగ్గిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ పిలుపుతో మళ్లీ రక్త నిల్వలు పెరుగుతాయన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో కేసీఆర్ ఆనందం నింపారని తెలిపారు. ప్రజల మౌలిక వసతుల క ల్పనలోనూ రాష్ట్రం ముందున్నదని స్పష్టం చేశా రు. అత్యవసర సమయాల్లో రక్తం దొరక్క అనేక మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే సీఎం పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మ న్ జోగు ప్రేమేందర్ రక్తం దానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజ య్, పవన్‌నాయక్, బండారి సతీశ్, టీఆర్ఎస్ పట్టణ మహిళా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు స్వ రూప, మమత, యూనిస్అక్బానీ పాల్గొన్నారు.
భైంసా, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని ముథోల్ ఎమ్మె ల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వివేకానందా ఆవాసంలో ముందస్తు వేడుకలు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వివేకానందా ఆవాసం పలువురు దాతలతో నిర్వహించడం అభినందనీయంగా ఉందన్నారు. అనంతరం ఆవాసానికి క్వింటాల్ బియ్యం, పండ్ల ను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీగౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ఆళా, కౌన్సిలర్లు కపిల్ షిందే, కాండ్లి సాయినాథ్, మంత్రి భోజరాం, ఆవాస అధ్యక్షులు శైలేశ్ మాశెట్టి వార్, డా. రామకృష్ణ గౌడ్, డా. దామోదర్ రెడ్డి, లింగారెడ్డి ఉన్నారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి16: సంస్కృతీ, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ వన్నె తెచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న గుర్తుచేశారు. ఆదిలాబాద్ మండలం వాన్వట్ గ్రామంలో నిర్వహించిన గోండుల ఆరాధ్య గురువు హీరాసుక జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి ఉన్నతమైనదని పేర్కొన్నారు. అక్కడి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ సోనేరావు, ఎంపీటీసీలు జంగుబాపు, జంగుపటేల్, సర్పంచ్‌లు తూర్పాబాయి,లక్ష్మణ్, నాయకులు రాంకిషన్, ఆశన్న, యాదవ్‌రావు, సుకులాల్, జలపతిరావు, ఉప సర్పంచ్ కేమ నందు, గ్రామస్తులు ఉన్నారు.