కుభీర్, మార్చి 1: రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించి పంటల ను కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ పేర్కొన్నారు. కుభీర్‌లో ని మార్కెట్ కమిటీ ఆవరణలో స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కందూర్ సం తోష్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రానికి, శనగ బస్తాలకు ప్రత్యేక పూజలు చేసి కొనుగోళ్లకు శ్రీకారం చు ట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టా పాస్తు పుస్తకం జిరాక్సు ప్రతులు వెంట తీసుకు రావాలని సూచించారు. సర్పంచ్ పానాజీ మీరా విజయ్‌కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెంచు రమేశ్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, పీఏసీఎస్ సీఈవో ఎగ్గం క్రాంతి కు మార్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, డైరెక్టర్లు దొంతుల లింగన్న, లాలేశ్, భూమన్న, నాయకు లు బొప్ప నాగలింగం, సూది రాజన్న, సాతం ర వి కుమార్, అనిల్, మాజీ సర్పంచ్ గోరేకర్ బా బు, సోషల్ మీడియా మండల ప్రతినిధి గడ్డం సంజీవ్, రైతులు బొప్ప మోనాజీ, చిమ్మన అరవింద్, తదితరులు పాల్గొన్నారు.