భూత్పూర్, జనవరి 4 : త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎలా వచ్చినా అందుకు అనుకూలంగా కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
పార్టీ నాయకులతో సమన్వయంగా ఉండాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. యూరియా కొరతను, పిం ఛన్ల్ల పెంపుపై, తులం బంగారం హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మున్సిపాటీలకు చెందిన నాయకులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వామన్‌గౌడ్, జెట్టి నర్సింహ్మారెడ్డి, సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, బాలస్వామి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.