హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3: సైబర్ నేరాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ గిరికుమార్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ(కో-ఎడ్యుకేషన్)లో సైబర్ క్రైమ్ విభాగం, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆర్.శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గిరికుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవుతున్నాయని, బాధితులు ముఖ్యంగా చదువుకున్న ఉద్యోగస్తులు, విద్యార్థులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
వాట్సప్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టకూడదని ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మన అకౌంట్ నుంచి డబ్బులు ఇతర అకౌంట్లోకి మార్పిడి అవుతున్నాయని వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ప్యాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అపరిచితులకు అసలు చెప్పవద్దని, బెట్టింగ్ యాప్, సైబర్ మోసగాళ్లు ఫ్రీగా ముందు డబ్బులు ఇచ్చి తర్వాత అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేస్తారని, విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా అనేకమైన యాప్స్ ద్వారా సమయం వృథా చేసి చదువుకు దూరమైతున్నారన్నారు. కార్యక్రమంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏ.గోపాల్, సైబర్ క్రైమ్ సిఐ అశోక్, గోపి, ఎస్సై శివ, హనుమకొండ సిఐ మచ్చ శివకుమార్, పోలీస్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్‌కుమార్, అధ్యాపకులు యాకూబ్, దయాకర్, బిక్షపతి, విజయ్‌చందర్, రాజేష్, శ్రీదేవి, రేవతి, లైబ్రరీ శ్రీదేవి, స్టూడెంట్ కౌన్సిలర్ కేఎం సరిత పాల్గొన్నారు.