ముంబై, ఏప్రిల్ 1: అచ్చేదిన్ తెస్తాం.. బ్యాంకుల్లో రూ.15 లక్షలు వేస్తాం.. అంటూ మోదీ సర్కారు ఇచ్చిన హామీలు ఏప్రిల్ ఫూల్ జోక్స్ అని శివసేన విమర్శించింది. ఏడేండ్లుగా ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని, ఫలితంగా సామాన్యుడి సంక్షేమం అనేది జీవన్మరణ సమస్యగా మారిందని ఆరోపించింది. శివసేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రకటించిన అచ్చేదిన్, ప్రతి ఒక్కరి బ్యాంకుల్లో రూ.15 లక్షలు వేస్తామనటం, పీవోకేను స్వాధీనం చేసుకొంటామని ప్రకటించటం, ఉద్యోగాలు కల్పిస్తామనటం ఏప్రిల్ ఫూల్ జోక్స్ లాంటివి అన్నారు.