ACB Raids | సంగారెడ్డి, ఏప్రిల్ 30 : సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రాపర్టీ టాక్స్ తగ్గించడానికి బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి రూ.35 వేలు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన నిఖిల్ బాధితుడి నుంచి 20 వేల రూపాయలు తీసుకున్నాడు.
మిగితా డబ్బు కూడా ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేడు నిఖిల్ రెడ్డి బాధితుడి నుంచి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మున్సిపల్ కార్యాలయంలో 4 గంటల పాటు అధికారుల విచారణ కొనసాగిందని.. కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.