Aam Aadmi Party : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) తొలిసారి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. అక్కడ అధికారం చేపట్టబోతున్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (JKNC) కే తాము మద్దతు ప్రకటిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నది. అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది.
కాగా, ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బీజేపీకి 29 స్థానాల్లో విజయం దక్కింది. కాంగ్రెస్ ఆరు చోట్ల, స్వతంత్రులు ఆరు చోట్ల గెలిచారు. ఆప్ ఒక స్థానం నెగ్గింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ మేరకు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.