Aadi Srinivas | ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించేందుకు మంగళవారం ఉదయం అధికారులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లారు.
ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకున్నారు.
వేములవాడ ఎమ్మెల్యే, సిరిసిల్ల కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించిన ఆది శ్రీనివాస్, కలెక్టర్
ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలిస్తుండగా కుంగిన ఫ్లోరింగ్.. తప్పిన ప్రమాదం pic.twitter.com/Ka1e92x8F4
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2025