జగిత్యాల : ప్రేమ వివాహం (Love marriage) చేసుకున్నాడని యువతి బంధువులు యువకుడి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. యువతిని ఈడ్చుకుంటూ కారులో వేసుకుని తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో వారి వివాహం జరిగింది. ఈ క్రమంలో యువతి బంధువులు యువకుడి ఇంటికి వచ్చి కర్రలతో దాడి చేసి, యువతిని తీసుకుపోయారు. యువతి బంధువుల దాడిలో గాయపడిన యువకుడి కుటుంబ సభ్యులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మాధవి ప్రాణాలకు హాని ఉందని, ఆమెను కాపాడి తమకు అప్పగించాలని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీటీవీ ఫుటేజ్
ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులు
గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని, ప్రేమ వివాహం చేసుకున్న జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్ అనే యువకుడు
వారం… pic.twitter.com/m7c7D8no8c
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2025