సూర్యాపేట : చేయని దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు కొట్టడంతో ఓ వ్యక్తికి ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt)పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట(Suryapet) జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్(Tipper driver )శెనిగా నాగరాజు తొండ గ్రామంలోని బాలాజీ క్రషర్ మిల్లులో గత కొంత కాలంగా టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే డీజిల్ దొంగతనం తన మీద మోపడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడి హాస్పిటల్కు తరలించారు.
గొలుసుల వెంకన్న దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ డీజిల్ దొంగతనం చేశాడు అని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ఆదేశాల ఇవ్వడంతోనే తిరుమలగిరి ఎస్ఐ సురేష్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఇలా ఉరి వేసుకున్నాన్నాని డ్రైవర్ నాగరాజు వీడియోలో తెలిపాడు. నాగరాజు మనస్థాపం చెంది చనిపోవాలనే అంత నిర్ణయం తీసుకో వడానికి కారణమైన వారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ స్థానికులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Akhil Akkineni | సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు.. కొండా సురేఖపై మండిపడ్డ అఖిల్ అక్కినేని