మహబూబ్నగర్ అర్బన్, జనవరి 4: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. ఆయా ఇండ్లలోని కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
సమీపంలో పెద్ద బ్లాస్టింగ్ శబ్దం వినిపించిందని.. ఆ తర్వాత భూమి కంపించినట్టు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా..? లేక బ్లాస్టింగ్ వల్ల వచ్చిన ఎఫెక్టా అనేది తెలియాల్సి ఉన్నది.