ఉడిపి: అబుదాబిలోని ప్రసిద్ధ బిగ్ టికెట్ ‘రాఫిల్ డ్రా’లో కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఉడుపి జిల్లా ఉద్యావర్కు చెందిన 33 ఏండ్ల శంతను శెట్టి విజేతగా నిలిచి, రూ.49 కోట్ల గ్రాండ్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. లాటరీ ఫలితాలు మంగళవారం ఆన్లైన్లో వెలువడగానే, స్వస్థలం ఉడిపిలోని అతని బంధువులు, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు.
శంతను శెట్టి ప్రస్తుతం మస్కట్‌లోని రిటైల్ సెక్టార్లో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బిగ్ టికెట్‌ను అతడు కొనుగోలు చేసినట్టు నిర్వాహకులు చెప్పారు.