శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మృత్యుంజయ్’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలపాటి నిర్మాతలు. రేబా జాన్ కథానాయికగా నటిస్తున్నది.
గురువారం రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. సరికొత్త కథ, కథనాలతో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని, శ్రీవిష్ణు పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సంగీతం: కాలభైరవ, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్.