ఐనవోలు( హనుమకొండ): ఐలోని మల్లన్న(Iloni mallanna) దండాలో.. మమ్మేలు మస్వామి సల్లంగ సూడు దండాలో అంటూ సంక్రాంతి పర్వదినం రోజున ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం శివమెత్తింది. తెలంగాణ జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బోగి, సంక్రాంతి పర్వదినాల్లో లక్షల్లో భక్తులు హాజరయ్యారు. ఆలయా ఆవరణంలో స్వామి వారి దర్శినం కోసం వచ్చిన భక్తులతో రద్దీగా మారింది. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలో బోనాలు, చేసి శివసత్తుల పూనకాలతో ఎల్లమ్మ దేవతకు, మల్లికార్జునస్వామికి నైవేద్యం సమర్పించారు.
సంక్రాంతి పర్వదినం రోజున అర్చకులు స్వామి వారికి ఉత్తరాయణ, పుణ్యాకాలము, విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు చేసి బిల్వార్చన శివలింగాన్ని అలకంరించారు. మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్ధపుసాద వితరణ మల్లికార్జునస్వామికి బంగారు మిసాలు, వెండి కిరీటం, వెండి కవచం సుగంధాలు వెదజల్లే గజ పుష్పమాలతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న మహానివేదన దేవుడి రథాన్ని మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కొబ్బరి కొట్టి ప్రారంభించారు. అనంతరం ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాలను నుంచి కూడ ప్రభల బండ్ల కట్టి స్వామి వారికి మహానివేదనగా సమర్పించారు.
స్వామిని దర్శించుకున్న ఎంపీ ఈటెల, ఎర్రబెల్లి దయాకర్రావు
ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండెటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, టి రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్ మల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక సర్పంచ్ గడ్డం రఘువంశీ, మండల నాయకులు, ఆలయా అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచులు గడ్డం రఘువంశీ, ఆడెపు స్రవంతి, గుడ్డెటి ఏలియా, కంజర్ల ఆశోక్రావు, ఉస్మాన్అలీ, మాజీ సొసైటీ చైర్మన్ చందర్ రావు, మాజీ సర్పంచ్ దయాకర్, మాజీ ఎంపీటీసీ రాజు, మాజీ కార్పోరేటర్ యాదగిరి, మాజీ జడ్పీటీసీ బిక్షపతి, గోపాల్ రావు రామ్మూర్తి, కుమార్, అశోక్, రాజు, నాగరాజు, లక్ష్మణ్, కొంరయ్య, దేవదాసు, ఏలియా, సుధాకర్, కుమారస్వామి, ముత్తిరెడ్డి కేశవరెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రణయ్, రాజు, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.