Asteroid | దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. 17న భూమికి చేరువగా ‘2024 ఆన్’
మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది.
Asteroid | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది. 721 నుంచి 1,575 అడుగుల (220-480 మీటర్ల) చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహశకలానికి ‘2024 ఆన్’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ గంటకు 19,842 మైళ్ల (31,933 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తున్నదని, ఇది ధ్వని వేగం కంటే 26 రెట్లు అధికమని ‘లైవ్ సైన్స్’ వెల్లడించింది.
ఈ గ్రహ శకలం భూగోళానికి దాదాపు 62 వేల మైళ్ల (లక్ష కిలోమీటర్ల) చేరువగా రానున్నది. ఇది భూమికి, చంద్రునికి మధ్య ఉన్న సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొనబోదని, మానవాళి భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించబోదని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగోళానికి 12 కోట్ల మైళ్ల (19.3 కోట్ల కిలోమీటర్ల) చేరువగా వచ్చిన ఖగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా, 46.5 లక్షల మైళ్ల (75 లక్షల కిలోమీటర్ల) చేరువగా వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

