అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ( Srikakulam District ) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆదివారం నందిగాం సమీపంలోని జాతీయ రహదారిపై ( National Highway) రోడ్డు పక్కన ఆగివున్న వ్యాన్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో ఒడిశా రాష్ట్రం సున్నాపురం చెందిన దాలయ్య, మోహినమ్మ లు చనిపోగా గాయపడిన ఐదుగురిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. శ్రీకాకుళం జిల్లా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.