Hyderabad | హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. పెళ్లి కావడం లేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన ప్రవీణ్ (30) పెళ్లి కావడం లేదని కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 20 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.