24 గంటల్లో 81,466 కేసులు.. 469 మరణాలు
469 మరణాలు | దేశంలో కొత్తగా 24 గంటల్లో 81,466 కొవిడ్ కేసులు, 469 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు నమోదవగా.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున జనం మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 81,466 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గతేడాది అక్టోబర్ మొదటి వారం తర్వాత ఇన్ని కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. దేశంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 469 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,03,131కు పెరిగింది.
తాజాగా 50,356 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,15,25,039 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1,63,396 మంది మరణించారని చెప్పింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 6,87,89,138 డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల కనిపిస్తున్న పదకొండు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
అలియాభట్కు కరోనా పాజిటివ్
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ
కరోనా ఎఫెక్ట్.. ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ రద్దు
పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్తగా 965 కరోనా కేసులు
కరోనా టీకా తీసుకున్న అమితాబ్ బచ్చన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

