రూ.70 లక్షల విలువ గల గంజాయి పట్టివేత..ముఠా సభ్యుల అరెస్ట్
cannabis seized | నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లింగ్ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

కొత్తూరు రూరల్, జనవరి 17 : నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లింగ్ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ పి. జగదీశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..భద్రాచలం అటవీ ప్రాంతంలో పండించిన గంజాయిని సూర్యాపేటకు చెందిన నాగరాజు, వినోద్, వరంగల్ కు చెందిన రవి మహారాష్ట్ర, అహ్మద్ నగర్కు చెందిన బాబా చందేకర్, తిరుమలి బాలు, గణేష్, రాజేంద్ర కు సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో వినోద్ ఓక్స్ వ్యాగన్ కారులో 214 కిలోల గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్ర కు చెందిన బాబా చందేకర్, తిరుమలి బాలు, గణేష్, రాజేంద్ర కారులో గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్మగ్లింగ్ ముఠాను, రూ.70లక్షల విలువగల గంజాయిని, రూ.2.10లక్షల నగదును, 3 కార్లను, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్ ముఠాకు చెందిన రవి, నాగరాజు పరారీలో ఉన్నట్లు, ఈ స్మగ్లింగ్ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందరిని అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో షాద్ నగర్ ఏసీపీ కుశల్కర్, కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్, వెంకట్ రెడ్డి, రవి, పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

