మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 3.19 కోట్ల పైచిలుకు విలువైన ఏడు కిలోల బంగారాన్ని విరాళంగా అందించనున్నారు. మేడ్చల్ నియో జకవర్గంలోని వ్యాపారవేత్తలు, ప్రముఖులు, విద్యాసంస్థల యజ మానులు స్వచ్ఛందంగా విరాళాలు అందించినట్టు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.