హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సమగ్రశిక్ష ఉద్యోగుల జీతాలు స్వల్పంగా పెరుగనున్నాయి. వీరి వేతనాలను 5శాతం మేర పెంచాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఈనెల 28న జరుగనున్న ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం ముందుంచనున్నది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలోని 18వేలకు పైగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి.
2026-27 విద్యాసంవత్సరం ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ బడ్జెట్ ఆమోదం కోసం విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనున్నారు. ఇదే క్రమంలో ఈసారి టీచర్స్ ట్రైనింగ్స్ బడ్జెట్లో కోత పెట్టనున్నారు. నిపు ణ్ భారత్స్కీమ్, టీచర్స్ ట్రైనింగ్స్ కోసం ఏటా రూ.30కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉన్నది. అయితే ఎస్సీఈఆర్టీ వద్ద రూ. 50 కోట్లున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైనింగ్స్ బడ్జెట్ను ఇతరత్రా అవసరాలకు మళ్లించనున్నారు.