హైదరాబాద్, మే12(నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో వెట్ ల్యాండ్స్(చెరువులు, నీటి వనరులు) కీలక పాత్ర పోషిస్తున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వెట్‌ల్యాండ్స్ పరిరక్షణ, వాటి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని బీఆర్ అంబేదర్ సచివాలయంలో మంగళవారం రాష్ట్ర వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రధాన వెట్ ల్యాండ్స్ సహా 28 ప్రాంతాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమావేశంలో వెల్లడించారు.