4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు

- సీఎంఆర్ఎఫ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం
- ఉమ్మడి ఏపీలో పదేండ్లలో 1.85 లక్షల మందికి ఇచ్చింది 750 కోట్లే
హైదరాబాద్, జనవరి 30 : వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 4 లక్షల మందికి రూ.2 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్ఎఫ్ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు. అందులో తెలంగాణవారు 50 వేల మంది కూడా ఉండరని అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఏడేండ్లలో నాలుగు లక్షల మందికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏకంగా రూ.2వేల కోట్లు సహాయం ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్కు ఒక సెక్షనే కేటాయించారు. ఈ సెక్షన్లో దాదాపు 50 మంది వరకు నిరంతరం పని చేస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి వైద్య సహాయం కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే పిలిపించి సరిచేసి దరఖాస్తును స్క్రూటినీ చేస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించేలా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నది.
దిల్దార్ సీఎం: వై సతీశ్‌రెడ్డి
కార్పొరేట్ వైద్యం అవసరమయ్యే ప్రతీఒక్కరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న ఉదారతను రాష్ట్ర యువకుడు వై సతీశ్‌రెడ్డి కొనియాడారు. ‘దిల్దార్ సీఎం’ అని ట్వీట్ చేశారు. నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడుతూ ఇంత దయాగుణం కలిగిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అనేకమంది తెలంగాణ బిడ్డలకు కార్పొరేట్ వైద్యం అందించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అంటేనే తెలియదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే ఈ ఏడేండ్లలో అందిన సహాయం చూస్తే తెలంగాణ నిధులు, తెలంగాణ ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

