రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.