
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూ కంపం సంభవించింది. వెస్ట్ కామెంగ్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లకు బయటకు పరుగులు పెట్టారు. అసోంలోని తేజ్‌పూర్‌కు 53 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది.