KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
CM KCR Birthday Special | అవును, నేను దేవుడిని నమ్ముతా. యాగాలు చేస్తా. మీకేం కష్టం? కావాలంటే మీరూ రండి, తీర్థం పెడతా!.. ఇదీ కేసీఆర్ అనే మాట. సమకాలీన రాజకీయాల్లో, అధికారంలో ఉంటూ తన స్వీయ మతావలంబన గురించి ఇంత సూటిగా చెప్పి, పాటించిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. సంప్రదాయంగా కేసీఆర్‌ది వైష్ణవాన్ని అవలంబించే కుటుంబం. కానీ శివ కేశవ భేదం లేకుండా పూజిస్తారు. కొత్త జిల్లాలు చేసినప్పుడు వాటికి వేములవాడ రాజన్న, భద్రాద్రి, జోగులాంబ అంటూ క్షేత్రాల పేర్లు పెట్టారు. బ్యారేజీలకూ, పంప్ హౌస్‌లకూ అన్నపూర్ణ, పార్వతి, సరస్వతి, సీతారామ, గాయత్రి, లక్ష్మి అని నామకరణం చేశారు. సాధారణంగా ప్రాజెక్టులకు కులీన దేవతల పేర్లు పెట్టే సంప్రదాయం అనాది నుంచీ ఉంది. కానీ కేసీఆర్… బడుగులు పూజించే వాటినీ సమంగా సమాదరిస్తారు. యాదవులు, గౌడ్లు ఆరాధించే కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న, గిరిజనులు కొలుచుకునే సమ్మక్క సారక్క పేర్లనూ ఆయన ఎంచుకున్నారు. ఆయన ఎర్రవల్లి ఇంటిలో ప్రతి నిత్యం గోపూజ జరుగుతుంది. కానీ వాటికి ఎక్కడా ప్రచారం కల్పించరు. రాజకీయాలకూ, మతానికీ సంబంధం లేదు. మతం మన వ్యక్తిగతం. ఇతరులకు ఇబ్బంది లేకుండా అనుసరించాలె. ప్రతి మతంలోనూ వెలుగుంది. చీకటీ ఉంది. ఏది ఎంచుకుంటామన్నది మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని నమ్ముతారు కేసీఆర్.
రూపాయి బిళ్ల నదిలో వేసి నమస్కరించడం తెలంగాణ సంప్రదాయం. ఎక్కడ గోదావరి వచ్చినా, కృష్ణ వచ్చినా ఆగి రూపాయి బిళ్లలు వేస్తాను. కృష్ణా, గోదావరిల్లో నేను వేసినన్ని రూపాయి బిళ్లలు ఎవరూ వేసి ఉండరు. తల్లీ గోదావరీ! మా బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు ఎప్పుడు మార్చుతావు అని దండం పెట్టి ఎన్నోసార్లు వేడుకున్నా.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
నాటికీ నేటికీ ఏకైక నాయకుడు కేసీఆర్
KCR | నిత్య విద్యార్థి.. నిరంతర అధ్యయనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

