వేదాలు భారతీయ సంస్కృతికి ప్రాణం
వేద జ్ఞానమే భారతీయ నాగరికత, సంస్కృతులకు మూలధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య తో కలిసి గవర్నర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు.
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యాదగిరిగుట్టలో 26వ తెలంగాణ వేద విద్వన్మమహాసభ
యాదగిరిగుట్ట, అక్టోబర్31: వేద జ్ఞానమే భారతీయ నాగరికత, సంస్కృతులకు మూలధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య తో కలిసి గవర్నర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో నిర్వహించిన 26వ తెలంగాణ వేద విద్వన్మహాసభల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ప్రెసిడెన్సియల్ సూట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తరతరాలుగా వేదాలను పరిరక్షిస్తూ వస్తున్న గురు- శిష్య పరంపర భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైనదని కొనియాడారు. వేద పరీక్షల్లో పాల్గొంటున్న 500 మందికి పైగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జయప్రతాలు అందుకున్న 10 మంది వేద విద్వాంసులను ప్రత్యేకంగా అభినందించారు. వేద విద్యాసంస్థలు, విద్యుత్ సభలు, గురుకులాలకు మరింత ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానం రూపొందించిన 2027 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

