ఆత్మగౌరవ పోరాటం
పల్లె వాతావరణానికి క్రైమ్ డ్రామాను జోడిస్తూ.. తమిళ చిత్రం ‘లెనిన్ పాండియన్' సెప్టెంబర్‌లో థియేటర్లకు వచ్చింది.
లెనిన్ పాండియన్
అమెజాన్ ప్రైమ్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: దర్శన్ గణేశన్, రోజా, గంగై అమరన్, శ్రీతా రావు, జార్జ్ మేరియన్, యుగేంద్రన్, ఆడుకలం నరేన్ తదితరులు
దర్శకత్వం: డి.డి. బాలచంద్రన్
పల్లె వాతావరణానికి క్రైమ్ డ్రామాను జోడిస్తూ.. తమిళ చిత్రం ‘లెనిన్ పాండియన్’ సెప్టెంబర్‌లో థియేటర్లకు వచ్చింది. ఇసుక మాఫియా ఆగడాలు, వారివల్ల సామాన్యులు పడే ఇక్కట్లను కండ్లకు కట్టింది. విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఇటీవలే ‘అమెజాన్ ప్రైమ్’లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
తమిళనాడులోని ఒక పల్లెటూరు నేపథ్యంలో కథ సాగుతుంది. దురై రాజు (గంగై అమరన్), తన భార్య సందనం (రోజా)తో కలిసి.. ఊరి చివరన ఓ చిన్న ఇంట్లో సాధారణ జీవితం గడుపుతుంటాడు. వాగు పక్కన తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు. పిల్లలు లేని దురై రాజు.. తన మేకనే బిడ్డగా భావిస్తాడు. దానికి ‘మీనాక్షి’ అని పేరు పెట్టి, ప్రేమగా పెంచుకుంటాడు. మరోవైపు.. ఆ ఊరి వాగులోంచి రాజారత్నం (ఆడుగాలం నరేన్), అతని కొడుకు రవి (యుగేంద్రన్) అక్రమంగా ఇసుకను తరలిస్తుంటారు.
స్థానిక రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకు భారీగా లంచాలు ఇస్తూ.. మొత్తం వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. అయితే, ఒకరోజు ఇసుక లారీ ఢీకొట్టడంతో దురై రాజు మేక చనిపోతుంది. తను ప్రేమగా పెంచుకునే మేక చనిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తాడు వృద్ధ రైతు. కానీ, అక్కడ అతణ్ని పట్టించుకోకపోగా.. కొట్టి, హేళనగా మాట్లాడుతారు. అవమానానికి గురైన దురై.. ఇసుక మాఫియా విషయాన్ని వీఏవో (అర్చన రవిచంద్రన్) దృష్టికి తీసుకెళ్తాడు. వెంటనే యాక్షన్ తీసుకున్న
వీఏవోను.. రాజారత్నం మనుషులు హత్య చేస్తారు.
మేకతోపాటు తనకు అండగా ఉన్న వీఏవోను హత్య చేయడంతో దురైరాజు కోర్టును ఆశ్రయిస్తాడు. అలా.. ఈ కేసు సీబీసీఐడీకి వెళ్తుంది. ఈ క్రమంలో దురై రాజుకు భద్రత కల్పించేందుకు సుందర పాండియన్ (దర్శన్ గణేశన్) అనే కానిస్టేబుల్‌ను కోర్టు నియమిస్తుంది. ఈ సుందర పాండియన్ది మరో కథ. ఇతని తండ్రి లెనిన్ పాండియన్.. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసి చనిపోతాడు. అతని స్థానంలోనే సుందర పాండియన్‌కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుంది.
అయితే సుందర పాండియన్ పిరికివాడనీ, అతను పోలీస్ ఉద్యోగానికి పనికిరాడని ఆ స్టేషన్‌లోని అధికారులు హేళన చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాను కూడా సమర్థుడైన పోలీసునేనని నిరూపించుకోవాలని సుందర పాండియన్ ప్రయత్నిస్తుంటాడు. ఒక వైపు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వృద్ధ రైతు, మరోవైపు తనను తాను నిరూపించుకోవాలని తపించే యువ కానిస్టేబుల్. వీరిద్దరూ కలిసి ఎలాంటి ప్రయాణం మొదలుపెట్టారు? అధికార బలం దండిగా ఉన్నవారిని ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనేది మిగతా కథ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
Vote Theft | ప్రపంచ దేశాల నోట.. ఓటు చోరీ మాట.. పలు దేశాల్లో కొనసాగుతున్న వివాదం
Harish Rao | కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
Miyapur Lands | మియాపూర్ భూముల్లో సర్వే.. మిగిలిన భూముల్లో భారీ నిర్మాణాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

