చర్మం మెరిసే వారికే అవకాశాలు
ఇండియన్ సినిమాలో కాస్టింగ్ ఎంపికలు చాలాసార్లు స్థానికేతర నటీమణులకే అనుకూలంగా ఉంటున్నాయని అభిప్రాయపడింది నటి రాధిక ఆప్టే. దీనిపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.
ఇండియన్ సినిమాలో కాస్టింగ్ ఎంపికలు చాలాసార్లు స్థానికేతర నటీమణులకే అనుకూలంగా
ఉంటున్నాయని అభిప్రాయపడింది నటి రాధిక ఆప్టే. దీనిపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తన సొంత అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోయిన్లకే ఎందుకు ఎకువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించింది. తెల్లటి మెరిసే చర్మం ఉంటేనే అవకాశాలు ఇస్తారనే ఇండస్ట్రీ ధోరణిని తప్పుబట్టింది.
ముంబై నుంచి వచ్చి ప్రాంతీయ సినిమాల్లో నటించే హీరోయిన్లకు భాష రాకపోయినా ఫర్వాలేదనే సిస్టమ్ తనకు నచ్చలేదని రాధిక చెప్పింది. ‘ఉత్తరాది భామలకు భాష రాకపోయినా వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పిస్తారు. ఈ పద్ధతి నాకు నచ్చలేదు. నటన అంటే కేవలం డైలాగులు బట్టీ పట్టడం కాదు. ఒక నటిగా ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. తోటి నటీనటులతో సహజంగా స్పందించాలి.
కొన్నిసార్లు సీన్ డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఏదైనా పాత్రకు కచ్చితంగా నేనే కావాలని మేకర్స్ భావిస్తే.. సౌత్ సినిమాలు చేయడానికి సిద్ధమే’ అని క్లారిటీ ఇచ్చింది రాధిక. అయితే, ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు భాషా సమస్యను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటానని చెబుతున్నది. దక్షిణాది చిత్రాల్లో పనిచేసినప్పుడు సెట్స్‌లో అందరూ తనను సొంత మనిషిలా చూసుకునేవారని గుర్తు చేసుకున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

