ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్
నయీం అనుచరులకు సంబంధించిన భూమిగా ప్రచారంలో ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115లోని రూ.4 కోట్ల విలువైన 13.17 ఎకరాల భూమి రికార్డుల మా ర్పులు.
- భూ వ్యవహారంలో నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
అచ్చంపేట, అక్టోబర్ 31 : నయీం అనుచరులకు సంబంధించిన భూమిగా ప్రచారంలో ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115లోని రూ.4 కోట్ల విలువైన 13.17 ఎకరాల భూమి రికార్డుల మా ర్పులు.. సంబంధంలేని వ్యక్తుల పేర్లపైన నమోదైన వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలు జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కదిలిక తెచ్చాయి. ఈ కథనాలకు స్పందించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమగ్ర విచారణకు ఆదేశించగా..
అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోనిఛాబ్రా విచారణ చేసి నివేదిక సమర్పించారు. విచారణలో భాగంగా పాత ఖాస్రా, పహాణీలు, ఆర్వోఆర్ రికార్డులు, భూభారతి పోర్టల్‌లోని దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎన్కంబరెన్స్ వివరాలను పరిశీలించారు. పాత రికార్డుల్లో ధ్యాప రామిరెడ్డి పేరుపై ఉన్న భూమి కొత్త రికార్డుల్లో ఉప విభాగాలుగా న మోదైనట్టు గుర్తించారు.
సర్వే నంబర్ 115/AAలో నమోదైన 13.17 ఎకరాల అంశంతో పాటు పేర్ల మార్పులు, పత్రాల ధ్రు వీకరణ, డిజిటల్ సంతకాల ప్రక్రియలోనూ లోపాలున్నట్టు తెలిసిం ది. పాత రికార్డులు ఒకలా.. కొత్త నమోదులు మరోలా ఉన్నట్టు అందించిన నివేదిక ఆధారంగా ఉప్పునుంతల తహసీల్దార్ సునీతను సస్పెన్షన్ చేస్తూ శనివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ భూ వ్యవహారంలో తహసీల్దార్‌పైనే చర్యలు తీసుకుంటారా? నాటి ఆర్డీవో యాదగిరి, సంబంధిత భూభారతి ఆపరేటర్ల పాత్రపై విచారణ ఏమైంది? అసలు సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
భూ రికార్డుల మార్పుల ప్రక్రియలో ఆర్డీవో పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొన్న భూభారతి ఆపరేటర్ల పాత్రపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.4 కోట్ల విలువైన భూమి.. రికార్డుల మార్పు వెనుక రూ. 70 లక్షలకుపైగా చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు హక్కుదారులెవరు? రికార్డులో మార్పులకు కారణమెవరు? లబ్ధిపొందింది ఎవరు? అనే అంశాలపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

